GDWL: పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రోడ్డుకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలు వాహనదారులకు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. అవి ఊడి కింద పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.