NGKL: లింగాల మండల కేంద్రంలో ఓ యువకుడు ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్(18) అనే యువకుడు సోమవారం రాత్రి కొత్త ఫోన్ కొనివ్వమని తన తల్లిని అడిగాడు. ఆర్థిక సమస్యల వల్ల తల్లి జీతం వచ్చాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.