NZB: బోధన్ మండలం ఏరాజ్ పల్లికి చెందిన సాయిలు రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. మంగళవారం చెరువులో అతని మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి సాయిలుగా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.