NLG: మిర్యాలగూడలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 5న వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో జరిగిన చోరీలో రూ.80 లక్షల నగదు మాయమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.66.50 లక్షల నగదుతో పాటు ఒక బైక్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు.