ఓ ఫుడ్ డెలివర్ యాప్ ద్వారా పన్నీరు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే చికెన్ బిర్యానీ డెలివరీ అయిందని తమిళ నటి సాక్షి అగర్వాల్ చెప్పారు. అయితే అది పన్నీరు అనుకుని సగం తిన్న తర్వాత అసలు నిజం గుర్తించి షాకయ్యానని తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ నాన్ వెజ్ తినలేదని, తనతో అలా తినిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగడం బాధాకరమని పోస్ట్ పెట్టారు.