BPT: కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెం, ఎట్రవారిపాలెం, బుద్దాం, యాజలి తదితర గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో సర్వే పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు.