WNP: పోషణ మాసం, బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఈ రెండు కార్యక్రమాల గోడ పత్రికలను తన ఛాంబర్లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.