గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్నారు. మహిళా మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా మాధవి తెలిపారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు