GNTR: మహాకవి గుర్రం జాషువా గుంటూరు జిల్లాలో జన్మించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు అన్నారు. జాషువా 130వ జయంతి సందర్భంగా ప్రముఖ సాహితివేత్త తెలకపల్లి రవికి ఈ నెల 27న జాషువా కవితా పురస్కారాన్ని అందిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. బ్రాడీపేట జాషువా విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు.