AKP: కే.కోటపాడులో కిసాన్ ఆగ్రో ఏజెన్సీస్ ఫెర్టిలైజర్స్ షాపును విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్టాక్ తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధికంగా విక్రయించినా బ్లాక్ చేసినా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంకర్ లాల్, ఏవో సోమశేఖర్ హెచ్చరించారు. స్టాక్ వివరాలు, ధరలతో బయట బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.