కలబందతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. గాయాలు త్వరగా తగ్గుతాయి. జుట్టు సమస్యలు దూరమవుతాయి. కలబందలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌ల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. కలబంద జెల్‌ను చర్మంపై రాయడం వల్ల సన్ బర్న్ నుంచి ఉపశమనం లభిస్తుంది.