VSP: 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు మంగళవారం “సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్”పై ప్లీనరీ సెషన్ జరిగింది. సీఐసీ కార్యదర్శి రష్మి చౌధరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ టూల్స్ ద్వారా పౌర కేంద్రిత పరిపాలన, పారదర్శకత, సమర్థత బలోపేతం అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.