BPT: మాదకద్రవ్యాల వినియోగంపై ఈగల్ టీం, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం వేదులపల్లిలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోకుండా అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు బానిసలైన వారు కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు.