AKP: సంపద కేంద్రాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు ఎండపల్లి సంపద కేంద్రం వద్ద మంగళవారం ఎంపీడీవో చంద్రశేఖర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. సంపద కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వీటి ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరే విధంగా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.