‘కాంతార 1’ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలపై రిషబ్ శెట్టి స్పందించారు. ఈ మూవీ షూటింగ్ టైంలో తనకు 4 సార్లు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. అప్పుడు చనిపోయేవాడినని.. ఆ దేవుడు కాపాడాడని తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ఈ మూవీ పూర్తయిందన్నారు. సెట్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, కానీ అవన్నీ లెక్కచేయకుండా చిత్రబృందం అంతా 3 నెలలు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం పని చేసిందని తెలిపారు.