VZM: దేవి నవరాత్రుల సందర్భంగా మంగళవారం బొబ్బిలి పట్టణంలో శ్రీదాడితల్లి అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాడితల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. బొబ్బిలి పట్టణం, గొల్లపల్లి, పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పూజలకు క్యూ కట్టారు.