WNP: పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దంత వైద్య నిపుణుల క్యాంపును మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దంత వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ కుమార్ పాల్గొని 71 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసి పలు రకాల సూచనలు చేశారు.