E.G: సొంత ఇళ్లు నిర్మాణం పేదవాడి కలగా మిగిలిపోయిందని వెంటనే కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి ఇళ్లు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజవర్గంలో రైతుల వద్ద హౌసింగ్ పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.