VZM : గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హై స్కూల్ ఆవరణలో గజపతినగరం ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు మొక్కలు నాటారు. అనంతరం ఆవరణలో విద్యార్థుల చేత పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీవో కళ్యాణి, ఈవో జనార్దనరావు, ఎంఈవో విమలమ్మ, బెల్లాన త్రినాధ రావు పాల్గొన్నారు.