సత్యసాయి: మడకశిరకు చెందిన సిద్దమ్మ కుమారుడితో జీవిస్తున్నారు. జీవనోపాధిగా పెంచుకున్న ఆవు పాము కాటుతో మృతి చెందడంతో ఆమె ఆదాయం కోల్పోయి తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన క్యాంపు కార్యాలయానికి ఆమెను పిలిపించారు. తన సొంత నిధులతో కొత్త ఆవును కొనుగోలు చేసి ఆమెకు అందజేశారు.