AP: పలు జిల్లాల్లో రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏలూరు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల కురిసే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.