ASR: మావోయిస్టుల వారోత్సవాల నేపధ్యంలో ఈనెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరు మీదుగా నడిచే అన్ని ఆర్టీసీ నైట్ సర్వీస్లు, నైట్ హాల్ట్ బస్సులు రద్దు చేయడం జరుగుతుందని ఆర్టీసీ అధికారులు శనివారం తెలిపారు. పగటి వేళ బస్సులు యధావిధిగా తిరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రయాణికులు గమనించాలని సూచించారు.