BDK: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరగా న్యాయం అందించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి అంశాలపై సమీక్షించారు.