W.G: నరసాపురం తీరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కుంభవృష్టిగా కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో మోకాలు లోతు నీరు నిలిచింది. గత వారం రోజులుగా ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గోదావరిపై కారు మేఘాలు కమ్మేసుకున్నాయి.