RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 145 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.