కృష్ణా: పెడనలోని బిఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే. బాలాజీ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మేళాలో అనేక కంపెనీలు పాల్గొని, ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.