SDPT: తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు వీర బైరాన్ పల్లి బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం, ఉదయం 10:00 గంటలకు కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ అధికారిక కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.