NLR: కావలిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు దేవిరెడ్డి నరేంద్ర, ఒంగోలు సాయికుమార్ మధ్య సోమవారం గొడవ జరిగింది. తన తలపై బీరు బాటిల్‌తో కొట్టి హత్యయత్నంకు పాల్పడ్డాడని ఒంగోలు సాయికుమార్‌పై కావలి పట్టణపోలీస్ స్టేషన్లో నరేంద్ర ఫిర్యాదు చేయడంతో ఎస్సై గోపీచంద్ కేసు నమోదు చేసి మంగళవారం సాయికుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.