WGL: జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులతో బతుకమ్మ ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.