W.G: భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసానిచ్చారు. మంగళవారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయం వద్ద ఆయనను ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమ సుందర్, నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.