PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలో ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పటేల్ ఐ కేర్ హాస్పిటల్, కరీంనగర్ సన్రైజ్ ఆసుపత్రి వైద్యులు సేవలందించారు. ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, సీబీపీ, కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు రోగులకు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు.