అన్నమయ్య: AP రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం దారుణమని YSR కాంగ్రెస్ పార్టీ నందలూరు మండల యువ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ASHAకు బాకీ ఉన్న 2 వేల కోట్ల బకాయిలను, AP ప్రభుత్వం తక్షణమే చెల్లించి, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.