MDK: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 2.6 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన సిటీ స్కాన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సిటీ స్కాన్ యంత్రం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలలో మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.