KDP: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా మైదుకూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మైదుకూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.