ప్రకాశం: బేస్తవారిపేట మండలం జేబీకే పురం మరియు చెట్టిచెర్ల గ్రామాలలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రఫీక్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రబీ సీజన్లో నల్లబర్లి పొగాకు సాగు నిషేధించడం జరిగిందన్నారు. వైట్ బర్లీ పొగాకు సాగుచేయు రైతులు తప్పనిసరిగా కంపెనీ నుండి బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతనే పంట సాగు చేయాలన్నారు.