VSP: దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపే జి.ఎస్.టిలో సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రజల భారాన్ని తగ్గించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా ‘వికసిత్ భారత్’కు పునాదులు వేస్తాయని ఆమె అన్నారు. బుధవారం మధురవాడలోని వి.కన్వెన్షన్స్‌లో జరిగిన జి.ఎస్.టి సదస్సులో ఆమె మాట్లాడారు.