NZB :రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా శక్తి పథకం పై డీఆర్డీఎ కల్చరల్ కో ఆర్డినేటర్ ఆష్ట గంగాధర్ రచించిన పాటను బుధవారం ప్రజా పాలన కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ NZB రూరల్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ పాల్గొన్నారు.