అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మార్గదర్శకత్వంలో పోలీసులు, శక్తి టీమ్లు బుధవారం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ర్యాగింగ్, బాల్యవివాహాలు, డ్రగ్స్, బెట్టింగ్ వంటివి భవిష్యత్తును నాశనం చేస్తాయని విద్యార్థులకు వివరించారు. కాగా, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, సైబర్ నేరాలపై హెచ్చరికలు చేశారు.