తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో 20వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. కాగా, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా,బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. అనంతరం 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.