AKP: నక్కపల్లి మండలం పెదబోదిగల్లం పునరావాస కాలనీలో పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి పునరావాస కాలనీని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. కాలనీలో తాగునీరు, ఎలక్ట్రిసిటీ, రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.