మేడ్చల్: జిల్లాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పేట్ బషీరాబాద్ PSపరిధిలో ఆర్థిక ఇబ్బందులతో గురువారం ఓ వ్యక్తి తన కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మైసమ్మగూడలో ఉన్న చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారు బహదూర్ పల్లికి చెందిన అశోక్(50), అతని కూతురు దివ్య (5) లుగా గుర్తించారు.