NGKL: నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం రుణాలు ఇవ్వాలని వెల్దండ మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు బెక్కరి సురేష్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల క్రితం నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు రుణాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం స్పందించి రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.