‘ఆపరేషన్ సింధూర్’లో లష్కరే తయ్యిబా ధ్వంసమైనట్లు లష్కరే కమాండర్ ఖాసిమ్ అంగీకరించాడు. ‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా మురిద్కేలో దెబ్బతిన్న ప్రధాన కార్యాలయాన్ని గతంలో కంటే భారీగా నిర్మిస్తామని చెప్పాడు. అయితే ధ్వంసమైన భవనంలో గతంలో చాలామంది ముజాహిద్దీన్లు(ఉగ్రవాదులు) శిక్షణ పొందినట్లు వెల్లడించాడు.