BHNG: ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమై భువనగిరిని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, రోడ్డుకు ఇరువైపులా, వినాయక విగ్రహం నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ఫుట్ పాత్ పై ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు.