W.G: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీరవాసం మండల వీఆర్ఎలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులకు పదోన్నతులు, నామినీ నియామకాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ ఏవీ రామాంజనేయులుకు వినతి పత్రం అందజేశారు.