ATP: రైతన్నకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, పామిడి మండల ఇన్ఛార్జి ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యామ్ వద్ద ఉత్తర కాలువ ద్వారా పామిడి మండలానికి సాగునీటిని విడుదల చేశారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. 2 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు.