ఆసియా కప్‌లో భాగంగా ఒమన్ జట్టు తొలిసారిగా నేడు భారత్‌తో T20 మ్యాచ్ ఆడబోతోంది. భారత్‌కు ఈ మ్యాచ్ నామమాత్రమే కావచ్చు కానీ ఆట మెలకువలు నేర్చుకోవడానికి ఒమన్‌కు గొప్ప అవకాశం. పైగా వచ్చే నెలలో ఒమన్ T20 WC క్వాలిఫయర్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత్ వంటి పటిష్ఠ జట్టుతో ఆడి ఎంతో నేర్చుకోవాలని, ప్లేయర్ల సలహాలు పొందాలని ఒమన్ భావిస్తోంది.