NLG: గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సమయంలో క్యాటరింగ్ సేవలు అందిస్తున్నామని, క్యాటరింగ్ బిల్లులు మాత్రం ఆరు నెలలుగా చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందుల గురి చేస్తుందని క్యాటరింగ్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నాగరాజు గౌడ్ విమర్శించారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.