WGL: పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ తీసుకువచ్చిన ఛార్జింగ్ బస్సులతో ప్రయాణికులు హైరానా పడుతున్నారు. రాయపర్తి మండలం మీదుగా ఉన్న వరంగల్-ఖమ్మం జాతీయపై రహదారిలో అనునిత్యం ఖమ్మం, తొర్రూర్ సూర్యాపేట డిపోలకు చెందిన ఛార్జింగ్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ, మార్గ మధ్యంలోనే ఛార్జింగ్ అయిపోయి బస్సులు ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.