ATP: వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో మారెమ్మ దేవాలయంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారికి శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ పూజకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.